logo

పరిహారం చెల్లించకుంటే ప్రగతిభవన్‌ ముట్టడి

పరిహారం చెల్లించకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని మాజీ ఎంపీ, భాజపా రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్యగౌడ్‌ హెచ్చరించారు.

Updated : 20 Jan 2023 16:02 IST

భువనగిరి : పరిహారం చెల్లించకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని మాజీ ఎంపీ, భాజపా రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్యగౌడ్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌ వద్ద తిమ్మాపూర్‌ గ్రామస్థులు చేపట్టిన దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. జలాశయం నిర్మాణం కోసం భూములు లాక్కున్న ప్రభుత్వం పరిహారం ఇవ్వకుండా భూనిర్వాసితుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ తన జల్సాల కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. నిర్వాసితులకు డబ్బు చెల్లించడంలేదని తెలిపారు. వారం రోజుల్లోగా పరిహారం చెల్లించకుంటే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామన్నారు.  గత 50 రోజులుగా నృసింహసాగర్‌ జలాశయం కట్టపై ఆందోళన చేస్తున్న భూ నిర్వాసితులు ఆర్డీవో కార్యాలయం నుంచి వీధుల మీదుగా కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తంగెళ్లపల్లి రవికుమార్‌, సింగిల్‌ విండో మాజీ ఛైర్మన్‌ ఎడ్ల సత్తిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి జహంగీర్‌, వివిధ పార్టీల నాయకులు బీఎల్‌ఎంగౌడ్‌, కె.నరసింహ, అశోక్‌, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని