logo

నేటి నుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు

భువనగిరి మున్సిపల్‌ పరిధిలోని స్టేషన్‌ రాయగిరి కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి.

Published : 04 Feb 2023 05:22 IST

పూర్తయిన మెట్లబావి పునరుద్ధరణ పనులు

రాయగిరి గుట్టపై గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం

భువనగిరి, న్యూస్‌టుడే: భువనగిరి మున్సిపల్‌ పరిధిలోని స్టేషన్‌ రాయగిరి కొండపై కొలువైన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రాచీన నేపథ్యం గల ఆలయ బ్రహ్మోతవ్సాలను ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆలయం కిందగల మెట్లబావి (కోనేరు) పునరుద్ధరణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రాంగణంలో సదుపాయాల కల్పన కోసం మున్సిపాలిటీ రూ.34 లక్షలు కేటాయించింది. బావి పూడికతీతతోపాటు ఆకర్షణీయంగా రంగులు వేసి పూర్వ వైభవం తెచ్చారు. విద్యుత్తు దీపాలతో అలంకరిస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని చదును చేశారు. రెండు హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ నడకదారిని సిద్ధం చేశారు. కల్యాణవేదిక, రథాన్ని సిద్ధం చేశారు. కొండపైన ఉన్న ఆలయానికి కూడా రంగులు వేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ఛైర్మన్‌ చింతల కిష్టయ్య ప్రత్యేక పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి.

నేడు ఆలయానికి ఉత్సవమూర్తులు

బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంలో భాగంగా శనివారం ఉత్సవ విగ్రహాలను రాయగిరి నుంచి ఊరేగింపు ఆలయానికి తీసుకొస్తారు. పద్మనాభస్వామి ఆలయం పక్కన ఉన్న కల్యాణ మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఈ నెల 5న కల్యాణోత్సవం, 6న రథోత్సవం, 7న చక్రతీర్థం, 8న శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. మెట్లబావిలోనే చక్రతీర్థం వైభంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని