అంధుల పాఠశాలతో కళాతపస్వికి అనుబంధం
భారతీయ శాస్త్రీయ సంగీత, నాట్యాల గొప్పతనాన్ని తన సినిమాల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ప్రఖ్యాత దర్శకుడు, కళా తపస్వి డా.కె.విశ్వనాథ్‌కు నల్గొండలోని అంధుల పాఠశాలతో అనుబంధం ఉంది.
నల్గొండలోని అంధుల పాఠశాల వెబ్‌సైట్‌ను 2006లో ప్రారంభిస్తున్న కళా తపస్వి విశ్వనాథ్
నల్గొండ సంక్షేమం, న్యూస్‌టుడే: భారతీయ శాస్త్రీయ సంగీత, నాట్యాల గొప్పతనాన్ని తన సినిమాల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పిన ప్రఖ్యాత దర్శకుడు, కళా తపస్వి డా.కె.విశ్వనాథ్‌కు నల్గొండలోని అంధుల పాఠశాలతో అనుబంధం ఉంది. జిల్లా కేంద్రంలో డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్(డ్వాబ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నల్గొండ అంధుల పాఠశాల కార్యకలాపాలు ప్రపంచ వ్యాప్తంగా తెలియాలన్న ఉద్ధేశంతో 2006లో ఆ సంస్థ వెబ్‌సైట్ www.helpblind.org ను హైదరాబాద్‌లో ఆయన ప్రారంభించారు. వెబ్‌సైట్ రూపొందించడానికి అయిన ఖర్చు రూ.10 వేలు అప్పట్లో ఆయనే అందచేశారు. విశ్వనాథ్ మృతికి సంతాపంగా నల్గొండలోని అంధుల పాఠశాలలో శుక్రవారం సంతాప సభ నిర్వహించారు. కళా తపస్వి విశ్వనాథ్‌తో ఉన్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను, ఆనాటి స్మృతులను డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పొనుగోటి చొక్కారావు గుర్తు చేశారు.
యాదగిరీశుడి క్షేత్రం మహిమాన్వితం..
యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: స్వయంభూ క్షేత్రమైన యాదగిరీశుడి సన్నిధి ఎంతో మహిమాన్వితమైందని, నమ్మిన భక్తులకు అభయమిచ్చే దేవుడనీ కళాతపస్వి ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్ చెప్పిన మాటలు ఇవి. 2006లో సినీ దర్శకుడు విశ్వనాథ్ దంపతులు ఈ క్షేత్రాన్ని సందర్శించి వ్యక్తపరిచిన మాటల్ని అప్పటి ఆలయోద్యోగులు గుర్తుకు తెచ్చుకొని దివంగతులైన కళాతపస్వికి నివాళి అర్పించారు. అప్పట్లో సతీసమేతంగా వచ్చిన ఆయన ఈ క్షేత్రంలో కొనసాగుతున్న నిత్యాన్న ప్రసాదం పథకానికి వారిద్దరి పేరిట విరాళం సమర్పించారు. వీలైతే యాదగిరి ఆలయ చరిత్రకు చెందిన సినిమా తీస్తానని చెప్పిన మాటను పలువురు గుర్తుచేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా