logo

‘డబుల్‌’ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి

ఆలేరు పురపాలికలో ఎట్టకేలకు రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. పట్టణ శివారులోని 1028 సర్వే నెంబరులో ప్రభుత్వం 64 ఇళ్లను నిర్మించింది.

Published : 27 Mar 2023 03:16 IST

ఆలేరు: పంపిణీకి సిద్ధంగా ఉన్న రెండు పడక గదుల ఇళ్లు

ఆలేరు, న్యూస్‌టుడే: ఆలేరు పురపాలికలో ఎట్టకేలకు రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. పట్టణ శివారులోని 1028 సర్వే నెంబరులో ప్రభుత్వం 64 ఇళ్లను నిర్మించింది. ఆరు నెలల క్రితం మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించగా 530 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ శాఖ ఆరు విడతలుగా చేపట్టిన విచారణల అనంతరం 106 మందితో కూడిన అర్హుల జాబితాను రూపొందించారు. శనివారం వైఎస్‌ఎన్‌ గార్డెన్స్‌లో జరిగిన పట్టణ సభలో అర్హుల జాబితాను తహసీల్దారు పి.రామకృష్ణ ప్రకటించి చదివి విన్పించారు. అనంతరం తహసీల్దారు కార్యాలయంలో అర్హులు, అఖిలపక్షం నాయకుల సమక్షంలో డ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. నిబంధనల మేరకు 11 మంది ఎస్సీలను, 8 మంది మైనార్టీలను, 2 ఎస్టీలకు, ఒకరు ఓసీ, మిగతా 42 మంది బీసీ కేటగిరీల నుంచి ఎంపిక చేశారు. లబ్ధిదారుల్లో అనర్హులు ఉంటే ఫిర్యాదు చేస్తే వెంటనే విచారణ చేసి అనర్హులని తేలితే వారిని తొలగిస్తామన్నారు. అర్హుల జాబితా నుంచి డ్రా పద్ధతిన కొత్త వారిని ఎంపిక చేస్తామని, లబ్ధిదారులకు త్వరలో ఇంటి యాజమాన్య ధ్రువపత్రాలు అందజేస్తామని తహసీల్దారు పి.రామకృష్ణ చెప్పారు. ఇళ్లు దక్కిన పేదలు ఒకింత సంతోషంలో ఉండగా, ఇళ్లు దక్కని పేదలు ఆవేదనకు గురయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని