logo

కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్‌

జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్‌ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు.

Published : 05 May 2024 04:28 IST

సూర్యాపేట కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్‌ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సజావుగా నిర్వహించేలా పటిష్ఠ చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పాటు నిర్వహించిన పోలింగ్‌లో నల్గొండ లోక్‌సభ పరిధిలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాల్లో 580 మంది, భువనగిరి లోక్‌సభ పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గంలో 136 మంది 85 ఏళ్లు నిండిన వృద్ధులు, నడవలేని దివ్యాంగులు ఓటేశారు. రెండు లోక్‌సభ పరిధిలో మొత్తం 692 మంది ఓటర్లు ఉండగా.. వారిలో 644(93.06) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వివిధ కారణాలతో ఓటేయని వారికి ఈ నెల 8న మరోమారు అవకాశం కల్పించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. రెండు రోజుల పాటు సజావుగా హోం ఓటింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ వెంకటరావు శనివారం అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని