logo

వడగళ్ల వాన.. పంట నష్టం

ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఆత్మకూర్ (ఎస్) మండలంలో పెద్ద ఎత్తున ఈదురు గాలులతో వర్షం కురిసింది.

Published : 05 May 2024 19:29 IST

భువనగిరి: ఆదివారం సాయంత్రం జిల్లాలోని పలు చోట్ల వడగళ్ల వాన కురిసింది. ఆత్మకూర్ (ఎస్) మండలంలో పెద్ద ఎత్తున ఈదురు గాలులతో వర్షం కురిసింది. దీంతో మామిడి పంట దెబ్బతింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పిడుగుపాటుతో గుండాల మండలం తురకల షాపురం గ్రామంలో పాడిగేదె మృతి చెందింది. అకాల వర్షంతో గుండాల మండల కేంద్రంలోని పీసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రంలో బస్తాలు, ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. అకాల వర్షాలు, పిడుగుపాటులతో యాదాద్రి భువనగిరి జిల్లాలో బీభత్సం సృష్టించింది. అడ్డగూడూరు మండలం కోటమర్ధిలో పిడుగుపాటుకు పాడి గేదెతో పాటు వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని