logo

ఎమ్మెల్యే గారు.. మరమ్మతులు చేయించరూ!

ఆలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యలతో సతమతమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం కళాశాలకు సొంత భవనం నిర్మించగా ప్రస్తుతం పూర్తిగా శిథిలమైంది.

Published : 06 May 2024 02:34 IST

కుంగిన వరండా ఇలా..

ఆలేరు, న్యూస్‌టుడే: ఆలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సమస్యలతో సతమతమవుతోంది. మూడు దశాబ్దాల క్రితం కళాశాలకు సొంత భవనం నిర్మించగా ప్రస్తుతం పూర్తిగా శిథిలమైంది. కొత్త భవనం నిర్మించాలనే డిమాండ్‌ దశాబ్ద కాలంగా ఉన్నా.. కార్యరూపం దాల్చడం లేదు. 2018లో ఆర్‌ఐడీఎఫ్‌ నిధులు రూ.85 లక్షలతో నాలుగు అదనపు గదులు నిర్మించి సరిపెట్టారు. కళాశాలలో ఎనిమిది అకడమిక్‌ గ్రూపులు, ఆరు వృత్తివిద్యా కోర్సుల గ్రూపులు ఉన్నాయి. తరగతుల నిర్వహణకు, వర్క్‌షాపులు, గ్రంథాలయం, క్రీడా విభాగం, ఎన్‌ఎస్‌ఎస్‌, స్టాఫ్‌ రూమ్‌లు తదితరాలు కలిపి 20కి పైగా గదులు అవసరం. కళాశాల భవనం మొత్తం శిథిలం కాడంతో తరగతులు నిర్వహణ, సహపాఠ్యాంశాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రాధాన్యం గల కళాశాలల్లో ఒకటైన ఆలేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పట్ల స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మరమ్మతులు జరిపించాలని, రానున్న కాలంలో కొత్త భవనం నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని