logo

క్రీడలతో ఉజ్వల భవిత

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా పాలనాధికారి చక్రధర్‌బాబు సతీమణి కె.కిరణ్మయి పేర్కొన్నారు. గురువారం నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో 58వ వార్షికోత్సవాల్లో భాగంగా విద్యార్థినుల

Published : 20 May 2022 01:44 IST

1.. క్రీడాజ్యోతిని వెలిగిస్తున్న కలెక్టర్‌ సతీమణి కె.కిరణ్మయి

నెల్లూరు (విద్య), న్యూస్‌టుడే: విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా పాలనాధికారి చక్రధర్‌బాబు సతీమణి కె.కిరణ్మయి పేర్కొన్నారు. గురువారం నగరంలోని డీకే ప్రభుత్వ మహిళా కళాశాలలో 58వ వార్షికోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కిరణ్మయి మాట్లాడుతూ కళాశాలలో చదివిన ఎంతో మంది నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, ఇతర దేశాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొని ఉద్యోగాలను సాధించాలని తెలిపారు. ముందుగా ఆమె పలు క్రీడా జ్యోతిని వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం పలు క్రీడల్లో, సాంస్కృతిక పోటీల్లో గెలుపాందిన వారికి బహుమతులు, పతకాలు అందించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డి.గిరి, గౌరవ అతిధి ఛీఫ్‌ కోచ్‌ ఆర్‌కే.యతిరాజు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి ఏ.విజయకుమార్‌, క్రీడా, సాంస్కృతిక కన్వీనర్‌ డాక్టర్‌.రాజరాజేశ్వరి, ఫిజికల్‌ డైరెక్టర్‌ విజయకళ, పీఆర్‌వో జోజి తదితరులు పాల్గొన్నారు.

2.. నృత్యం చేస్తున్న విద్యార్థినులు

3.. పరుగు పందెం పోటీల్లో..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని