logo

వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత

విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకను వెలిసి తీసి, సమాజానికి ఉపయోగపడేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు.

Published : 29 Jan 2023 01:58 IST

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

మాట్లాడుతున్న మంత్రి కాకాణి, చిత్రంలో కలెక్టర్‌ చక్రధర్‌బాబు, మేయర్‌ స్రవంతి

నెల్లూరు(విద్య), న్యూస్‌టుడే: విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకను వెలిసి తీసి, సమాజానికి ఉపయోగపడేలా చూడాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సూచించారు. శనివారం నగరంలోని దర్గామిట్ట జిల్లా పరిషత్తు బాలుర ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ, జిల్లా సైన్స్‌ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు. మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. సైన్స్‌కు సంబంధించిన పరిశోధనలు జరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్ననాటి నుంచే పరిశోధనలపై దృష్టిసారించి సరికొత్త ఆవిష్కరణల దిశగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర విద్యారంగంలో అనేక విప్లవాత్మక మార్పులు వచ్చాయని.. నాడు-నేడు కార్యక్రమం ద్వారా జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలల రూపురేఖలు మార్చారని పేర్కొన్నారు. కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల కిందటే మన దేశంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉందని.. ఇతర దేశాలకంటే మనం ఏ మాత్రం తక్కువ కాదని వివరించారు. వైజ్ఞానిక ప్రదర్శనల్లో బహుమతులు పొందడం కంటే.. పాల్గొనడం ముఖ్యమని ఉద్బోధించారు. జిల్లా సైన్స్‌ అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ.. పాఠశాల, మండల స్థాయి అనంతరం.. జిల్లా స్థాయికి పోటీ పడిన 186 ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచామన్నారు. వీటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి పంపుతామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్‌ స్రవంతి, వైఎస్సార్‌ సీపీ సేవాదళ్‌ అధ్యక్షుడు కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, విద్యాశాఖ ఆర్జేడీ సుబ్బారావు, సమగ్రశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు ఏపీసీ సీహెచ్‌ ఉషారాణి, ఇన్‌ఛార్జి విద్యాశాఖాధికారిణి గ్లోరికుమారి, ప్రధానోపాధ్యాయిని జయమ్మ, సైన్స్‌ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని