Nellore: వైకాపాలో మరో అసంతృప్తి గళం.. పరిశీలకుడిపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే

తన నియోజకవర్గంలో పరిశీలకుడి ఏర్పాటుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మండి పడ్డారు. సీఎం, జిల్లా మంత్రి వద్ద తేల్చుకోవడమే కాదు.. దేనికైనా సిద్ధం అని మేకపాటి హెచ్చరించారు.

Updated : 01 Feb 2023 21:50 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో అధికార పార్టీపై మరో వైకాపా ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో పరిశీలకుడి ఏర్పాటుపై ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి మధ్య పరిశీలకుడు వారధిగా ఉండాలన్న ఆయన.. తన నియోజకవర్గంలో ధనుంజయరెడ్డి అనే పరిశీలకుడు చిచ్చుపెడుతున్నారని ధ్వజమెత్తారు. వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ధనుంజయరెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. తనను ధనుంజయరెడ్డి ఇబ్బంది పెడుతున్నారంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. పరిశీలకుడి నిర్ణయాల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందన్నారు. ధనుంజయరెడ్డి వైకాపా కాదని, తెలుగుదేశం వ్యక్తి అని ఆరోపించారు. వైఎస్‌ కుటుంబానికి తాను విధేయుడినని.. తనపై పెత్తనం చేయడం కుదరదన్నారు. సీఎం జగన్‌, జిల్లా మంత్రి వద్ద తేల్చుకోవడమే కాదు.. దేనికైనా సిద్ధం అని మేకపాటి హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని