logo

విజిలెన్స్‌ కమిటీలా.. ఎక్కడున్నాయబ్బా!

అవి స్థిరాస్తి రంగంలో అక్రమాలను నిరోధించడానికి ఏర్పాటుచేసిన కమిటీలు. ఇందులో ఎవరెవరు ఉండాలో నిర్దేశించారు. కానీ కార్యాలయమే లేదు. కనీసం ఫర్నిచర్‌ కూడా లేదు.

Updated : 01 Jun 2023 05:35 IST

కోవూరు నియోజకవర్గంలో వేసిన లేఅవుట్‌

అవి స్థిరాస్తి రంగంలో అక్రమాలను నిరోధించడానికి ఏర్పాటుచేసిన కమిటీలు. ఇందులో ఎవరెవరు ఉండాలో నిర్దేశించారు. కానీ కార్యాలయమే లేదు. కనీసం ఫర్నిచర్‌ కూడా లేదు. ఈకారణంగా అలంకారప్రాయంగా మారాయి. అక్రమాలకు అడ్డుకట్టపడడంలేదు. ఇదీ రియల్‌ ఎస్టేట్‌ లేఅవుట్ల పరిశీలనకు నియమించిన విజిలెన్స్‌ కమిటీల తీరు.

నెల్లూరు(జడ్పీ), న్యూస్‌టుడే : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ 2021లో అక్రమ లేఅవుట్లపై కొరడా ఝళిపించేందుకు విజిలెన్స్‌ కమిటీలను నియమించింది. దీనికి విధులు, అధికారాలు నిర్దేశిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. వీటిని ఏర్పాటుచేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందాయి. అప్పటి లెక్కల ప్రకారం జిల్లాలో 941 పంచాయతీలున్నాయి. నెల్లూరు, గూడూరు, కావలి డివిజన్లలో విజిలెన్స్‌ కమిటీలను ఏర్పాటుచేశారు. వీటిలో సీనియర్‌ గ్రామ విస్తరణాధికారి, సీనియర్‌ కార్యదర్శి, సీనియర్‌ సహాయకులను సభ్యులుగా నియమించారు. కాగితాల్లో ఏర్పాటైన ఈకమిటీల కార్యకలాపాలు ఎక్కడా కనిపించడం లేదు. తనిఖీలు చేసిన దాఖలాలు లేవు.

సౌకర్యాలు లేక..

కమిటీలకు కార్యాలయంతో పాటు ఫర్నిచర్‌, కంప్యూటర్‌, అవసరమైన సిబ్బందిని కేటాయించాలని, వాహన సదుపాయం కల్పించాలని జీవోలో పొందుపరిచారు. ఇందుకు నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు.  ఫలితంగా ఎక్కడా కార్యాలయం ఏర్పాటుకాలేదు. వీరు ఎక్కడ ఉన్నారు.. ఏంచేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు.


సీనియర్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తాం

సుస్మితారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నెల్లూరు

పంచాయతీల్లో అక్రమ లేఅవుట్ల నిరోధానికి ఏర్పడిన విజిలెన్స్‌ కమిటీలపై ఆరా తీస్తాం. ఈ కమిటీలు ఎక్కడ ఉన్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏమిటనే దానిపై సీనియర్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్‌ దృష్టికి తీసుకెళతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని