logo

ఆహ్లాదం.. హామీలకే పరిమితం

ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు.

Published : 29 Mar 2024 03:06 IST

ఆత్మకూరు పట్టణ ప్రజలు కాసింత సేదతీరటానికి ఏర్పాటు చేస్తామన్న ఉద్యానవనాలు హామీలు అమలుకు నోచుకోలేదు. జిల్లాలో ముఖ్య పట్టణాల్లో ఆత్మకూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ గత పాలక వర్గం కాలంలో ఉద్యానవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. సోమశిల నీటి శుద్ధి విభాగం పక్క స్థలంలో పనులు సైతం మొదలు పెట్టారు. ఆవరణ చదును చేసి చుట్టూ ప్రహరీ పునాదులు నిర్మించే సమయానికి రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. దాంతో పనులు అర్ధాంతరంగా ఆగాయి. ఆపై పనుల్లో కదలిక లేదు.

ఆత్మకూరు, న్యూస్‌టుడే: పట్టణంలో ఉద్యానవనాల నిర్మాణంపై నాయకులు అనేక హామీలు ఇచ్చారు. అయినా కార్యరూపంలోకి రాలేదు. పట్టణంలో ఇప్పటి వరకు నాలుగు ప్రాంతాల్లో ఉద్యానవనాలు నిర్మించాలని సంకల్పించారు. సోమశిల నీటి శుద్ధి విభాగం పక్కన, బస్టాండు సమీపంలోని ఎస్పీకాలనీ మధ్య, ఆత్మకూరు చెరువు, సోమశిల రోడ్డు మధ్య, ఏపీటిడ్కో భవనాల వద్ద వీటిని నిర్మించాలని నిర్ణయించారు.

వీటిలో సోమశిల నీటిశుద్ధి విభాగం వద్ద మంజూరైన ఉద్యానవనం నిర్మాణ పనులు అర్ధాంతరంగా ఆగాయి. దీని కోసం తెప్పించిన వ్యాయామ పరికరాలను పాత పురపాలక కార్యాలయం ఆవరణలºని నేతాజీ క్లబ్‌లో ఏర్పాటు చేశారు. ఎస్సీ కాలనీ మధ్యలో నిర్మించే ఉద్యానవనం పనులు ముందుకు సాగలేదు. ఇటీవల ప్రతిపాదనలు పెట్టినా ఇంకా కార్యరూపంలోకి రాలేదు. చెరువు పక్కన ఉద్యానవనం.. బోట్‌ షికారు పనులు కార్యరూపంలోకి రాలేదు. ఏపీ టిడ్కో సముదాయం మధ్య ఉద్యానవనం పనులు కొంతమేరకు జరిగినా ఆగిపోయి ఉన్నాయి. టిడ్కో భవనాల మధ్య తలపెట్టిన ఉద్యానవనానికి వ్యాయామ పరికరాలు తెప్పించారు. వాటిని బిగించక అలానే పక్కన వదిలేశారు. దాంతో అవి తుప్పుపడుతున్నాయి. సంవత్సరాల తరబడి వీటిని నిర్లక్ష్యంగా వదిలివేశారు.


అవన్నీ గతంలోని ప్రతిపాదనలే

ఫజులుల్లా కమిషనర్‌ ఆత్మకూరు పురపాలకం

ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనలు లేవు. గతంలో బస్టాండు సమీపంలోని ఉద్యానవనం నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టి ఉన్నారు. ఇంకా కార్యరూపంలోకి రాలేదు. మిగిలిన ఉద్యానవనాల విషయం తెలియదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని