icon icon icon
icon icon icon

Chandrababu: రాష్ట్రంలో దొంగలు పడ్డారు.. కాపాడుకోవాలి: చంద్రబాబు

కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.

Published : 27 Apr 2024 18:35 IST

ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం రాగానే అంగన్‌వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌ నవరత్నాలు.. నవమోసాలు అయ్యాయని దుయ్యబట్టారు. ‘‘గులకరాయితో హత్యాయత్నం చేశానని నాపై నింద వేశారు. కోడి కత్తి కేసులోనూ ఇలాంటి ఆరోపణలే చేశారు. బ్యాండేజ్‌ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్‌ అనుకున్నారు. అందరూ హేళన చేయడంతో ఇవాళ బ్యాండేజ్‌ తీసేశారు. గాయం కపడిందా?’’ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

‘‘ సీఎం జగన్‌ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారు. పోలవరాన్ని పూర్తి చేస్తానని చెప్పి.. గోదావరిలో కలిపారు. వారంలోగా సీపీఎస్‌ రద్దు చేస్తానన్న హామీ నెరవేరిందా? రాష్ట్రంలో ఉత్తరకొరియా పరిస్థితి నెలకొంది. ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైకాపా మేనిఫెస్టోలో లేదు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్సీ పైనే. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం చేస్తా. తల్లికి వందనం కింద ప్రతి పిల్లవాడికి ఏటా రూ.15 వేలు ఇస్తా. ఆత్మకూరు సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. వచ్చే ఎన్నికల్లో మీ జీవితాలు మార్చే బటన్‌ నొక్కండి. రాష్ట్రంలో దొంగలు పడ్డారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఈ ఎన్నికలు మన భవిష్యత్‌ను మార్చబోతున్నాయి. 

మేం వస్తే అభివృద్ధి.. వైకాపా వస్తే అరాచకం. మా పాలన స్వర్ణయుగం.. వైకాపా పాలన రాతియుగం. సీఎం జగన్‌ ఇవాళ చేతులెత్తేశారు. వైకాపా మేనిఫెస్టోతో పోలిస్తే.. మా మేనిఫెస్టో సూపర్‌ సక్సెస్‌. చంద్రబాబు అంటే అభివృద్ధికి బ్రాండ్‌. నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్‌ పీహెచ్‌డీ చేశారు. వైకాపా మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్‌. తమ మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌ అని అన్నారు. అందులో హామీలను నెరవేర్చారా?మద్య నిషేధం చేస్తానన్న హామీ ఏమైంది? స్వార్థం కోసం మహిళల తాళిబొట్లు తెంపేసిన వ్యక్తి జగన్‌’’ అని చంద్రబాబు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img