logo

రూ.5 కోట్ల బంగారు, వెండి ఆభరణాల పట్టివేత

వైయస్‌ఆర్‌ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్‌పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.

Published : 19 Apr 2024 04:00 IST

బద్వేలు, గోపవరం న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా గోపవరం మండలంలోని పీపీకుంట చెక్‌పోస్టు వద్ద గురువారం రూ.5 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను ఎన్నికల ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, బద్వేలు గ్రామీణ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. సీఐ విక్రమసింహ వివరాల మేరకు... ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన గణేష్‌, నారాయణసింగ్‌ అనే వ్యాపారులు కారులో  నెల్లూరు నుంచి కడప, ప్రొద్దుటూరు పట్టణాలకు బయలుదేరారు. పీపీకుంట వద్దకు రాగానే తనిఖీలు చేయగా అక్రమంగా తరలిస్తున్న 7.5 కిలోల బంగారం, 11.5 కిలోల వెండి ఆభరణాలను తరలిస్తుండగా పట్టుబడినట్లు తెలిపారు. వీటిని సీజ్‌ చేసి కడప ఆదాయ పన్నుల శాఖ అధికారులకు అప్పచెప్పినట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో గ్రామీణ ఎస్సై రవికుమార్‌, ఏఎస్సై నరసింహరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు