logo

తనిఖీలు విస్తృతం చేయండి: కలెక్టర్‌

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు.

Published : 20 Apr 2024 04:38 IST

నెల్లూరు(కలెక్టరేట్‌) : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా సరిహద్దులు, ఇతర ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు నగరపాలకసంస్థ కార్యాలయం కమాండ్‌ కంట్రోల్‌ సెంటరులో అధికారుతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాత్రి వేళల్లో కూడా తనిఖీలను ముమ్మరంగా చేపట్టి అక్రమంగా రవాణా అవుతున్న వాటిని సీజ్‌ చేయాలన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీపై దృష్టి పెట్టాలని తెలిపారు. ఈనెల 18న నామినేషన్లు ప్రారంభమైనప్పటి నుంచి ఖర్చులన్నీ అభ్యర్థుల ఖాతాలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో శిక్షణ కలెక్టర్‌ సంజన సిన్హా, డీఆర్వో లవన్న, నోడల్‌ అధికారులు బాపిరెడ్డి, పద్మావతి, కన్నమనాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని