logo

ఉదయగిరిలో వడగండ్ల వాన

మండలంలో సోమవారం బలమైన ఈదురు గాలులతో ఒకమోస్తారు వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తాకిడి ఎక్కువగా ఉంది.

Published : 07 May 2024 04:00 IST

ఉదయగిరి, న్యూస్‌టుడే : మండలంలో సోమవారం బలమైన ఈదురు గాలులతో ఒకమోస్తారు వడగండ్ల వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తాకిడి ఎక్కువగా ఉంది. సాయంత్రం ఉన్నఫలంగా ఆకాశం మేఘావృతమై బలమైన ఊదురుగాలులు వీచాయి. ఒకమోస్తారు వడ్లగండ్ల వర్షం కురిసింది. రేకుల ఇళ్లపై రాళ్లు పడినట్లు శబ్ధం రావటంతో స్థానికులు ఆందోళన చెందారు. పడిన వడగండ్లను స్థానికులు సేకరించారు. గాలులకు దేకూరుపల్లిలో రామయ్య అనే రైతు పశువుల కోసం ఏర్పాటు చేసిన కొట్టంపై రేకులు ఎగిరిపోయాయి. వ్యవసాయ కళాశాల సమీప నర్సరీలో చెట్టు కూలిపోయి విద్యుత్తు తీగలపై పడింది. దీంతో రాత్రి 9 గంటల వరకుపైగా విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. వాతావరణం కాసింత చల్లబడటంతో స్థానికులు ఉపశమనం పొందారు.

వరికుంటపాడు: మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం సాయంత్రం ఉరుములు, ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు, మూగజీవాలకు కొంతమేర ఉపశమనం కలిగింది. జి.కొత్తపల్లెలో విద్యుత్తు తీగలు తెగిపోయాయి. చెట్ల కొమ్మలు సైతం విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఇంటిపైకప్పు రేకులు గాలి ధాటికి ఎగిరి కింద పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని