logo

గ్రామీణ పేదరిక నిర్మూలనకు కార్యాచరణ

గ్రామీణ ప్రజల్లో పేదరికాన్ని తగ్గించేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా స్వశక్తి సంఘాల మహిళలను భాగస్వాములు చేస్తూ జీపీడీపీ(గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు) సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా

Published : 29 Sep 2022 03:21 IST

రాష్ట్రం నుంచి కామారెడ్డి, రంగారెడ్డి డీపీఎంలు ఎంపిక
ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

పట్నా సదస్సులో కామారెడ్డి, రంగారెడ్డి డీపీఎంలు

గ్రామీణ ప్రజల్లో పేదరికాన్ని తగ్గించేందుకు గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా స్వశక్తి సంఘాల మహిళలను భాగస్వాములు చేస్తూ జీపీడీపీ(గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు) సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా డీఎంఐ(డెవలప్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌, పట్నా) ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌ ప్రోగ్రాం ఆన్‌ లోకల్‌ డెవలప్‌మెంట్‌(ఏపీఎల్‌డీ) పేరిట ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నారు. బిహార్‌ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలనలో స్వశక్తి సంఘాలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా మహిళలు చేపడుతున్న కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు కామారెడ్డి, రంగారెడ్డి గ్రామీణాభివృద్ధిశాఖ డీపీఎంలు సుధాకర్‌, స్వర్ణలత రాష్ట్రం నుంచి పాల్గొంటున్నారు.

ప్రణాళిక రచన.. క్షేత్రస్థాయి పర్యటన
గ్రామీణ పేదరికాన్ని తగ్గించేందుకు వి.పి.ఆర్‌.పి(విలేజ్‌ పావర్టీ రెడ్యూజ్‌ ప్లాన్‌) సిద్ధం చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఏర్పాట్లు చేస్తోంది. డీఎంఐ సదస్సులో ఇందుకు అవసరమైన కార్యాచరణ చేయనున్నారు. బిహార్‌లోని గ్రామాల్లో పేదరికాన్ని తగ్గించేందుకు అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేసి మొదటగా రాష్ట్రంలోని కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో అమలు చేసే యోచనలో గ్రామీణాభివృద్ధిశాఖ ఉన్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని