logo

మద్యం అమ్మకాలపై మహిళల ఆగ్రహం

అక్రమ మద్యం అమ్మకాలపై పెద్దమల్లారెడ్డి గ్రామ మహిళలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి 40 మద్యం సీసాలను దొంగచాటుగా తీసుకొచ్చి విక్రయిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.

Published : 05 Oct 2022 03:48 IST

భిక్కనూరు, న్యూస్‌టుడే: అక్రమ మద్యం అమ్మకాలపై పెద్దమల్లారెడ్డి గ్రామ మహిళలు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఓ వ్యక్తి 40 మద్యం సీసాలను దొంగచాటుగా తీసుకొచ్చి విక్రయిస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు. పెద్దసంఖ్యలో చేరుకున్న మహిళలు, యువకులు అమ్మకందారుణ్ని నిలదీశారు. పట్టుబట్టి అతనితోనే సీసాలను ధ్వంసం చేయించారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారించారు. పోలీసులు, ఆబ్కారీ అధికారులు మద్యం అమ్ముతున్న వారిని పట్టుకోవాల్సింది పోయి పట్టుకున్న తమపైనే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా గ్రామంలో మద్యం అమ్మితే ఇలాగే తిరగబడతామని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని