logo

అమ్మాయి పుడితే.. రూ.5 వేలు

అమ్మాయి పుడితే భారంగా భావిస్తున్న రోజులివి. ఇలాంటి సమాజంలో కుమార్తె పుట్టడం వరమంటున్నారు డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి సర్పంచి పానుగంటి రూప.

Updated : 04 Feb 2023 06:19 IST

వినూత్న కార్యక్రమానికి సుద్దపల్లి సర్పంచి శ్రీకారం

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి గ్రామీణం: అమ్మాయి పుడితే భారంగా భావిస్తున్న రోజులివి. ఇలాంటి సమాజంలో కుమార్తె పుట్టడం వరమంటున్నారు డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి సర్పంచి పానుగంటి రూప. తల్లిదండ్రుల్లో భయాన్ని దూరం చేసి అభయం ఇచ్చేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్ల పుడితే రూ.5 వేల బాండ్‌ ఇస్తానని ప్రకటించారు. గ్రామంలో ఈ నెల 5 నుంచి ఏడాది పాటు అమలు చేస్తామన్నారు.

ఎందుకూ నిర్ణయం?

గ్రామ పంచాయతీలో రికార్డులను పరిశీలించగా.. ఏటా 20లోపు మాత్రమే ఆడపిల్లలకు సంబంధించిన జనన ధ్రువపత్రాలు తీసుకుంటున్నారని గుర్తించారు. ఈ లెక్కన వీరి జననం తక్కువగా ఉంటుందని నిర్ధరించుకొని, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంతోపాటు తనవంతుగా ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రూప చెబుతున్నారు.

సర్కారు బడిలో చదువులు

గ్రామంలోని తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చదివించేలా ప్రోత్సహించేందుకు సర్పంచి దంపతులు రూప- సతీష్‌రెడ్డి మొదటి అడుగు వేశారు. తమ పిల్లలు యోగితారెడ్డి(9వ తరగతి), రక్షితరెడ్డి(6వ తరగతి)ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తున్నారు.


సంబరాలు చేసుకోవాలి

రూప, సర్పంచి, సుద్దపల్లి

కూతురు పుడితే కుటుంబంలో సంబరాలు చేసుకోవాలి. గ్రామంలో ఆడ శిశువు జన్మిస్తే రూ.5 వేలు ఇవ్వాలనే ఆలోచన రెండేళ్ల క్రితమే వచ్చింది. కొన్ని అనివార్య కారణాలతో అమలు చేయలేదు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని 2024 ఫిబ్రవరి 5 వరకు అమలు చేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు