logo

శునకాలకు గోవుల తోడు

పర్లాఖెముండి పట్టణ ప్రధాన మార్గాల్లో గోవులు వాహనదారులు, బాటసారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్లపై బైఠాయిస్తుండడంతో రాకపోకలు చేసేవారు అవస్థలు పడుతున్నారు.

Published : 05 Oct 2022 02:29 IST

రోడ్లపై సంచరిస్తూ హడలెత్తిస్తున్న వైనం

రోడ్డుపై వాహనాలకు అడ్డంగా నిలిచిన ఆవులు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి పట్టణ ప్రధాన మార్గాల్లో గోవులు వాహనదారులు, బాటసారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. రోడ్లపై బైఠాయిస్తుండడంతో రాకపోకలు చేసేవారు అవస్థలు పడుతున్నారు. దీంతోపాటు శునకాల బెదడ తీవ్రంగా వేధిస్తోంది. వాహనాల వెంట పడుతుండడంతో వాహనదారులు, పాదచారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పలు వీధులతోపాటు బజారు కూడలి ప్రాంతంలో గుంపులు గుంపులుగా తిరుగుతూ హడలెత్తిస్తున్నాయి. పురపాలక అధికారులు దీనిపై దృష్టి సారించి గోవులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, కుక్కల సమస్య తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని