logo

పాత్రపుట్‌లో రెండు వంతెనల నిర్మాణానికి ఆమోదం

జయపురం-మల్కాన్‌గిరి మార్గంలో పాత్రపుట్‌ వద్ద జాతీయ రహదారుల అథారిటీ ఆధ్వర్యంలో రెండు వంతెనలు, ఒక కల్వర్టు నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది.

Published : 06 Dec 2022 03:24 IST

అతి పురాతన పాత్రపుట్‌ వంతెన

సిమిలిగుడ, న్యూస్‌టుడే: జయపురం-మల్కాన్‌గిరి మార్గంలో పాత్రపుట్‌ వద్ద జాతీయ రహదారుల అథారిటీ ఆధ్వర్యంలో రెండు వంతెనలు, ఒక కల్వర్టు నిర్మించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ఈమేరకు నిధులు మంజూరై, టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. జయపురం సమీపంలోని పాత్రపుట్‌లో బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన అతి పురాతన వంతెన ఉంది. ఆ ఇనుప వారధి చూడముచ్చటగా ఉండడంతో సందర్శనీయ స్థలంగా గుర్తింపు పొందింది. కొన్నాళ్లుగా అది శిథిలమై ప్రమాదకర స్థితికి చేరుకుంది. దీనికి మరమ్మతులు చేయాలని కొందరు, పురాతనమైనది కావడంతో దాన్ని అలాగే ఉంచి పక్కనే మరొకటి నిర్మించాలని మరికొందరు డిమాండ్‌ చేశారు. దీంతో ఎన్‌.హెచ్‌. అధికారులు దాన్ని కూల్చకుండా పక్కనే రెండు వంతెనలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇందుకు రూ.18.71 కోట్లు మంజూరయ్యాయని, పాత వంతెన పక్కనే 140 మీటర్ల పొడవైన పెద్ద వారధి, 35 మీటర్ల పొడవైన మరో చిన్న సేతువు, ఒక కల్వర్టు నిర్మిస్తామని సంబంధిత విభాగ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఖిరేశ్వర్‌ కొందపాణి తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గుత్తేదారు టెండరు దక్కించుకున్నారని, రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని