logo

పంచాయతీ కార్యాలయానికి తాళం

మల్కాన్‌గిరి సమితి గౌడగుడ పంచాయతీ కార్యాలయానికి గ్రామప్రజలు తాళం వేశారు.

Published : 01 Feb 2023 03:43 IST

గదిలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మల్కాన్‌గిరి సమితి గౌడగుడ పంచాయతీ కార్యాలయానికి గ్రామప్రజలు తాళం వేశారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం గౌడుగుడ పంచాయతీ కార్యాలయంలో గ్రామసభ ఏర్పాటు చేసి ప్రధానమంత్రి ఆవాస్‌యోజన పథకంపై అవగాహన కల్పించారు. 428 మంది పేర్లు జాబితాలో ఉన్నప్పటికీ 48పేర్లను తొలగించారని సభలో అధికారులు తెలిపారు. దీన్ని గ్రామ ప్రజలు వ్యతిరేకించారు. అర్హుల పేర్లను తొలగించి వేరే వారి పేర్లను ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. అనంతరం అధికారులను ఓ గదిలో పెట్టి స్థానికలు తాళం వేసేశారు. విషయం తెలుసుకుని పోలీసులు, సమితి అభివృద్ధి అధికారి అజయ్‌కుమార్‌ ప్రధాన్‌, తహసీల్దారు చందన్‌కుమార్‌ భోయి తదితరులు వివరాలు ఆరా తీశారు. దర్యాప్తు చేసి జాబితాను తయారు చేస్తామని హామీ ఇవ్వడంతో  గదిలో ఉన్న సమితి ఉపాధ్యక్షుడు నిరంజన్‌ హల్దార్‌, సర్పంచి పండ్రి పజడియామి, ఉప సర్పంచి సుభాష్‌ విశ్వాస్‌, వార్డు మెంబరు విశ్వజిత్‌ విశ్వాస్‌, పంచాయతీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి నిఖిల్‌ బెనర్జీ, గ్రామ రోజ్‌గార్‌ సేవక్‌ జగదీశ్‌లను విడిచిపెట్టారు.

పంచాయతీ కార్యాలయం ఎదుట గ్రామస్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని