logo

విదేశీ గడ్డపై ఒడిస్సీ నృత్యం

ప్రపంచంలో ఒడిస్సీ నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పర్లాఖెముండి పట్టణంలోని జగన్నాథ్‌ ఒడిస్సీ ఆర్ట్స్‌ సెంటర్‌కు చెందిన 14మంది కళాకారులు మలేసియా బయల్దేరారు.

Published : 01 Feb 2023 03:43 IST

మలేసియా బయల్దేరిన కళాకారుల బృందం

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: ప్రపంచంలో ఒడిస్సీ నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. పర్లాఖెముండి పట్టణంలోని జగన్నాథ్‌ ఒడిస్సీ ఆర్ట్స్‌ సెంటర్‌కు చెందిన 14మంది కళాకారులు మలేసియా బయల్దేరారు. ఈ నెల 4న కౌలాలంపూర్‌లో జరిగే గ్లోబల్‌ ఫెస్టివల్‌ వేదికపై ఈ బృందం నృత్యప్రదర్శన ఇవ్వనుంది. మన దేశంతో పాటు వివిధ దేశాల నుంచి బృందాలు పాల్గొంటాయి. ఒడిశా నుంచి ఒడిస్సీ గురువు గజేంద్ర పండా, ఇన్‌స్టిట్యూట్‌ గురు డి.ప్రియాంక ఆధ్వర్యంలో కళాకారులు నృత్యప్రదర్శన చేయనున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత పట్టణ కళాకారులు విదేశాల్లో నృత్యాలు చేయబోతున్నారని, కళాభిమానులకు ఆ సంస్థ అధ్యక్షుడు బిచిత్రా నంద్‌ బెబర్త, సంస్థ ముఖ్య సలహాదారు ఆదర్శదాస్‌, తదితరులు అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని