ద్విచక్ర వాహనాల చోరీ ముఠా పట్టివేత
నవరంగపూర్ జిల్లాలో వివిధ చోట్ల చోరీకి గురైన ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలు
నవరంగపూర్, న్యూస్‌టుడే: నవరంగపూర్ జిల్లాలో వివిధ చోట్ల చోరీకి గురైన ద్విచక్రవాహనాలను పోలీసులు పట్టుకొని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశారు. డాబుగావ్ పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ సుశ్రీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం.. మే 16న జబగూడకు చెందిన చంద్ర మిర్గన్ గ్రామ సమీపంలో జాతరకు వెళ్లి. తిరిగి వచ్చేసరికి ద్విచక్రవాహానం కనిపించలేదు. దీనిపై డాబుగావ్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయగా, ఐఐసీ సునీల్ కుమార్ ప్రధాన్ దర్యాప్తు ప్రారంభించారు. తొలుత జయంతి నగర్ ప్రాంతానికి చెందిన రామ్‌చంద్ర జానిని పట్టుకొని విచారించగా చోరీ ముఠా గుట్టు దొరికింది. ఈ ముఠా సభ్యులైన ఉమ్మర్‌కోట్ సమితి దొడ్రకు చెందిన దుమురు హరిజన్, సుధీర్ హరిజన్, రాయ్‌ఘర్ సమితి జమదొరకు చెందిన చందన్ హరిజన్‌లను అరెస్టు చేశారు. ముఠా సభ్యులు కలసి రాయ్‌ఘర్, కొసగుముడ, డాబుగావ్ సమితుల్లో చోరీ చేసిన 17 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని, త్వరలో పట్టుకుంటామని ఎస్పీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు
-
Chandrababu Arrest: అమీర్‌పేటలో చంద్రబాబుకు మద్దతుగా భారీ ర్యాలీ
-
Apply Now: సీబీఎస్ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్షిప్.. దరఖాస్తు చేశారా?
-
Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు