logo

చిట్‌ పేరిట రూ. 2 కోట్లకుపైగా టోకరా

చిట్‌ఫండ్‌ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.

Published : 28 Mar 2024 04:28 IST

పోలీస్‌ స్టేషన్లో తృప్తిరాణి

రాయగడ పట్టణం, న్యూస్‌టుడే: చిట్‌ఫండ్‌ పేరిట ఓ మహిళ రూ.2 కోట్లకుపైగా టోకరా వేసిన ఉదంతం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బుధవారం నిందితురాలితోపాటు ఆమె సోదరుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక రింగురోడ్డు, సమీపంలో తృప్తిరాణి ఖొరొ అనే మహిళ గత కొంత కాలంగా చిట్‌ఫండ్‌ పేరిట పలువురు మహిళల నుంచి డబ్బులు వసూలు చేసింది. నాలుగు రోజుల కిందట ఇంటిని ఖాళీ చేసి కుటుంబ సభ్యులతో కలిసి పరారైంది. బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తృప్తిరాణి, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న బాధిత మహిళలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని తమ గోడు విన్నవించుకున్నారు. భాజపా మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బురిడి లక్ష్మీ ఠాణాకు చేరుకొని బాధితులకు అండగా నిలిచారు. న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను కోరారు. దీనిపై పోలీసులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని