logo

బిజద లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ 21 లోక్‌సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు.

Published : 28 Mar 2024 04:37 IST

15 మందిలో నలుగురు మహిళలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ 21 లోక్‌సభ స్థానాలకుబుధవారం 15 మందితో తొలి జాబితా ప్రకటించారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు.

ధర్మేంద్రతో తలపడనున్న ప్రణవ

ఊహించినట్లే సంబల్‌పూర్‌ స్థానంలో బిజద రాజకీయ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ప్రణవ ప్రకాష్‌ దాస్‌ను అభ్యర్థిగా చేశారు. సంబల్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ భాజపా తరఫున బరిలో ఉన్న సంగతి తెలిసిందే. విద్యాశాఖ మంత్రి సుధాం మరాండికి మయూర్‌భంజ్‌ సీటు కేటాయించారు. కీలకమైన సుందర్‌గఢ్‌ స్థానంలో ప్రముఖ హాకీ క్రీడాకారుడు, రాజ్యసభ మాజీ ఎంపీ దిలీప్‌ తిర్కీని అభ్యర్థిగా చేశారు. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఎంపీ జోయల్‌ ఓరం భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కేంద్రపడలో భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బైజయంత్‌ పండా అభ్యర్థి కాగా, మాజీ ఎమ్మెల్యే అంశుమన్‌ మహంతి బిజద అభ్యర్థిగా రంగంలోకి దిగనున్నారు. మాజీ ఎంపీ ప్రదీప్‌ మాఝి నవరంగపూర్‌ బరిలో నిలిచారు. గతంలో ఆయన కాంగ్రెస్‌ను వీడి బిజదలో చేరిన సంగతి తెలిసిందే. సుదీర్ఘ రాజకీయ చరిత్ర గల కౌసల్య హిక్కాక కొరాపుట్‌ అభ్యర్థిగా ఎంపికయ్యారు. గంజాం జిల్లా అస్కా స్థానానికి తొలిసారిగా రంజితా సాహును సీఎం ఎంపిక చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని