logo

లక్ష్మీపూర్‌లో త్రిముఖ పోరు

కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Published : 18 Apr 2024 05:38 IST

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా లక్ష్మీపూర్‌ నియోజకవర్గంలో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాక ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. బిజద, భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులు ప్రభు జాని, కైలాష్‌ చంద్ర కూల్‌ సేకా, పవిత్ర శాంత పేర్లు ఖరారు కావడంతో త్రిముఖ పోటీ తప్పదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. లక్ష్మీపూర్‌ నియోజకవర్గంలో 1974, 1980, 1985, 1995, 2008 (ఉప ఎన్నికలలో), 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులదే ఆధిక్యం. దీంతో ఈ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలిచింది. 2019లో బిజద అభ్యర్థి ప్రభుజాని, తన ప్రత్యర్థి కైలాష్‌ (కాంగ్రెస్‌)పై 219 ఓట్ల తేడాతో గెలుపొందారు. తర్వాత మాజీ ఎమ్మెల్యే కైలాష్‌ చంద్ర కాంగ్రెస్‌ను వీడి బిజదలో చేరారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్‌ రాకపోవడంతో భాజపాలో చేరారు. ప్రస్తుతం భాజపా తరఫున బరిలో నిలుస్తున్నారు. కంచుకోటగా నిలిచే లక్ష్మీపూర్‌ నియోజక వర్గంలో బిజద మళ్లీ గెలుపొందాలని ప్రయత్నాలు సాగిస్తుంది. కాంగ్రెస్‌ తన పూర్వ వైభవాన్ని నిలుపుకొనేందుకు కృషి చేస్తోంది. బిజద అధికారం చేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. టికెట్‌ కేటాయింపులో అభ్యంతరాలు రావడంతో ప్రధాన పార్టీలకు పలు సమస్యలు ఎదురవుతున్నాయి. వలసలు సైతం పెరుగుతున్నాయి. సింహాసనాన్ని అధిష్ఠించేది ఎవరు అన్న దానిపై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని