logo

విద్యుదాఘాతంతో కార్మికుడికి అస్వస్థత

గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు

Published : 05 May 2024 03:39 IST

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు
పర్లాఖెముండి, న్యూస్‌టుడే: గజపతి జిల్లా మోహన ఠాణా పరిధిలోని పుతిలిపోంకలో విద్యుదాఘాతంతో కార్మికుడు అస్వస్థకు గురయ్యాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే  ఠాణా పరిధిలోని గోవిందపూర్‌ పంచాయతీ పుతిలిపోంకలో ప్రభుత్వ మార్కెట్‌ కాంప్లెక్స్‌ పైకప్పుపై నిలుచొని పనిచేస్తున్న క్రమంలో పై నుంచి వెళ్తున్న 11కేవీ విద్యుత్తు తీగలు తగిలి అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు మోహన ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన చికిత్స కోసం బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. అస్వస్థతకు గురైన వ్యక్తి నజారిత్‌ సైబర్‌(22)గా తెలుస్తోంది.


గంజాయి స్వాధీనం...  ముగ్గురి అరెస్ట్‌

 నవరంగపూర్‌, న్యూస్‌టుడే: అక్రమంగా గంజాయి రవాణా చేస్తుండగా నవరంగపూర్‌ పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. నిందితులు టెంటులిఖుంటి ఠాణా పరిధిలో మెంట్రి గ్రామానికి చెందిన హఫీజ్‌ ఖా, బరగావ్‌కి చెందిన బేణుధర్‌ సౌర, సిరాగూడ గ్రామానికి చెందిన ఆమన్‌ ఖాగా గుర్తించారు. వారి  నుంచి 16 కిలోల గంజాయి, ఒక స్కూటీ, మూడు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితులని కోర్టుకు తరలించారు.


రిజర్వాయరులో ఇద్దరి జలసమాధి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఉక్కునగరం రవుర్కెలాలో శనివారం సాయంత్రం విషాధఛాయలు అలముకున్నాయి. కోల్‌ నది రిజర్వాయరులో స్నానానికి దిగిన ముగ్గురు యువకులు మునిగిపోయారు. అక్కడున్నవారు ఒకర్ని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకున్నాడు. మిగిలిన ఇద్దరు జలసమాధి అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. మృతులు ఎవరన్నది స్పష్టం కాలేదు.


నకిలీ పొల్యూషన్‌ పత్రాలు జారీ- ఏజెంట్‌ అరెస్ట్‌

జయపురం, న్యూస్‌టుడే: నకిలీ పొల్యూషన్‌ పత్రాలు మిల్లర్లకు ఇచ్చి వారి ద[గ్గర నుంచి రూ. లక్షలు దోచుకున్న కేసులో జయపురం టౌన్‌ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఐఐసీ రమణి రంజన్‌ దొలై తెలిపిన వివరాలు ప్రకారం, స్థానిక లింగరాజ్‌ నగర్‌కు చెందిన సమీర్‌కుమార్‌ పండా 2019లో పట్టణంకి చెందిన 10 మంది మిల్లర్ల వద్ద రూ.50వేలు చొప్పున తీసుకొని పొల్యూషన్‌ క్లియరెన్స్‌ సర్టిఫికేట్లు ఇచ్చారు. కాల వ్యవధి ఈ ఏడాది మార్చి 31తో గడువు ముగిసింది. కొరాపుట్‌ కాలుష్య విభాగంలో సర్టిఫికెట్‌ పునరుద్ధరణ కోసం మిల్లర్లు దరఖాస్తు చేసుకోగా, ఆ పత్రాలు నకిలీవని తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని