గిరి శిఖర గ్రామాలకు రహదారులు
‘గిరి శిఖర గ్రామాల రహదారులకు మోక్షం కల్పించాం. అటవీ శాఖ అనుమతులు వచ్చాయి. వారం, పది రోజుల్లో పనులకు శంకుస్థాపన చేస్తాం’ అని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.రాజన్నదొర తెలిపారు.
రూ.70 కోట్లు మంజూరు
సాలూరు, న్యూస్టుడే: ‘గిరి శిఖర గ్రామాల రహదారులకు మోక్షం కల్పించాం. అటవీ శాఖ అనుమతులు వచ్చాయి. వారం, పది రోజుల్లో పనులకు శంకుస్థాపన చేస్తాం’ అని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి.రాజన్నదొర తెలిపారు. శుక్రవారం ఆయన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మొత్తం 11 రోడ్లకు ప్రతిపాదించగా ఎనిమిదింటికి సుమారు రూ.70 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. తమ్మిగుడ్డి నుంచి మెట్టగుడ్డి, కంకణాపల్లి-రొడ్డవలస, నీలంవలస-గుమ్మిడిగుడ, అజూరు-చాకిరాయివలస, తోణాం నుంచి డిప్పలపాడు మీదుగా దిగువశెంబి, 26వ జాతీయ రహదారి నుంచి కరడవలస, నంద నుంచి పగులుచెన్నూరు మీదుగా కొదమ, వేటగానివలస మీదుగా అరకు, శతాభి రోడ్డు పనులకు అటవీశాఖ అనుమతులు వచ్చాయన్నారు. ఇందుకు అటవీ శాఖకు ప్రభుత్వం రూ.4.21 కోట్లు చెల్లించడంతో పాటు ఇప్పటికే 70 ఎకరాల ప్రభుత్వ భూమిని బదులుగా అప్పగించిందని చెప్పారు.
రూ.2 కోట్లు విడుదల
సాలూరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర గిరిజన శాఖ నుంచి రూ.2 కోట్ల నిధులు మంజూరయ్యాయని రాజన్నదొర తెలిపారు. తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించామన్నారు. రోడ్డు సౌకర్యం కోసం ఇప్పటికే ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన వాటిని పరిశీలించి, పనులు చేసేలా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Earthquake: తుర్కియే, సిరియాలో భూకంప విలయం.. 1600 దాటిన మృతులు
-
India News
Anand Mahindra: సానియా మీర్జా నాకు స్ఫూర్తి.. ఆనంద్ మహీంద్రా మోటివేషనల్ పోస్ట్
-
Movies News
Sembi Review: రివ్యూ: సెంబి
-
Movies News
Social Look: రెండు జళ్ల ప్రణీత.. దుబాయ్లో నేహాశర్మ.. అను ‘బ్లూ’ డ్రెస్సు!
-
India News
Parliament: ‘అదానీ’ అంశంపై చర్చకు పట్టు.. వరుసగా మూడోరోజూ పార్లమెంట్ వాయిదా
-
India News
నిరుద్యోగ సమస్యకు కారణమదే.. ఉద్యోగాల కోసం వెంపర్లాడొద్దు: మోహన్ భాగవత్