logo

ఆదివాసీ ఉత్సవాలు ప్రారంభం

ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో గిరిజనులు ముందస్తు వేడుకలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా డప్పు వాయిద్యాలతో ఐటీడీఏ పీవో ఆనంద్‌ను ఆహ్వానించారు. ఐటీడీఏ ఆవరణలోని అడవితల్లి విగ్రహానికి పీవో క్షీరాభిషేకం చేసి వస్త్రాలను సమర్పించారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.

Published : 09 Aug 2022 05:36 IST

విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న పీవో ఆనంద్‌

పార్వతీపురం, న్యూస్‌టుడే: ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పార్వతీపురంలో గిరిజనులు ముందస్తు వేడుకలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా డప్పు వాయిద్యాలతో ఐటీడీఏ పీవో ఆనంద్‌ను ఆహ్వానించారు. ఐటీడీఏ ఆవరణలోని అడవితల్లి విగ్రహానికి పీవో క్షీరాభిషేకం చేసి వస్త్రాలను సమర్పించారు. అనంతరం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. మంగళవారం జరగనున్న ఉత్సవాల్లో గిరిజనులంతా పాల్గొనాలని పీవో కోరారు. ఏపీవో సురేష్‌కుమార్‌, డీడీ కిరణ్‌కుమార్‌, ఏఏవోలు ప్రసాదరావు, తిరుపతిరావు, శ్రీనివాసరావు, సూర్యనారాయణ దొర, రామారావు, గిరిజన నాయకులు పారమ్మ, గౌరమ్మ, తమ్మయ్య, రంజిత్‌, సురేష్‌, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని