తాగునీటి కష్టాలపై నిలదీత
పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని 14 వార్డు తెదేపా కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీదేవి విమర్శించారు.
సమావేశం నిర్వహిస్తున్న ఛైర్‌పర్సన్ గౌరీశ్వరి
పార్వతీపురం పురపాలక, న్యూస్‌టుడే: పట్టణంలో తాగునీటి ఇబ్బందులు తీవ్రంగా ఉన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని 14 వార్డు తెదేపా కౌన్సిలర్ ద్వారపురెడ్డి శ్రీదేవి విమర్శించారు. శనివారం పుర సాధారణ సమావేశం అధ్యక్షురాలు గౌరీశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో శ్రీదేవి మాట్లాడుతూ.. ఎండలు మండుతుంటంతో నీటి అవసరాలు పెరిగాయని, ఆ స్థాయిలో సరఫరా జరగడం లేదని సభ దృష్టికి తీసుకెళ్లారు. అయిదురోజులకు ఒకసారి కుళాయిల నుంచి నీరు వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. పురలో పాడైన బోర్లను బాగు చేయాలని కోరారు. ఇప్పలపోలమ్మ, ఎర్రకంచమ్మ, బంగారమ్మ జాతరల నేపథ్యంలో లక్షల్లో వచ్చే జనానికి ఎలా నీరు అందిస్తారని ప్రశ్నించారు. కమిషనరు రామప్పలనాయుడు మాట్లాడుతూ పండగ నేపథ్యంలో తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. తోటపల్లి నుంచి నీటిని విడుదల చేసి ఊట బావులకు పూర్తిస్థాయిలో అందేలా చూస్తామన్నారు. అదనపు ట్యాంకులు ఏర్పాటు చేస్తామన్నారు. ఆరు అంశాలను అజెండాలో ఉంచగా వాటిపై చర్చించి కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఉపాధ్యక్షులు గున్నేశ్వరరావు, రుక్మిణి, ఇంజినీరింగ్, ఇతర శాఖల అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!