logo

విద్యాలయాల్లో కొవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరి

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాలయాల్లో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పేర్నమిట్టలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ..

Published : 22 Jan 2022 04:26 IST

విద్యార్థులతో ముచ్చటిస్తున్న కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌

సంతనూతలపాడు, న్యూస్‌టుడే: కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాలయాల్లో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పేర్నమిట్టలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పాఠశాలల్లో ప్రతి విద్యార్థి మాస్క్‌ ధరించేలా చూడాలన్నారు. శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నాణ్యతతో కూడిన భోజనం అందించాలన్నారు. అనంతరం తరగతి గదిలోని విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. బాగా చదువుకుంటే సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగొచ్చని తెలిపారు. అనంతరం 54 మంది పదో తరగతి విద్యార్థుల్లో కేవలం తొమ్మిది మంది మాత్రమే మధ్యాహ్న భోజనం చేస్తున్నారని తెలుసుకుని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు మాస్క్‌లు లేకుండా కనిపించడం, కొన్ని తరగతి గదుల్లో కుర్చీలు లేకపోవడంపై ప్రశ్నించారు. పరిశీలనలో కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ రామానాయుడు, ఎంఈవో ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం.ప్రమోద, ఉపాధ్యాయులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని