logo

సెబ్‌ అదనపు ఎస్పీ బాధ్యతల స్వీకరణ

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (సెబ్‌) అదనపు ఎస్పీగా ఎన్‌.సూర్యచంద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం... జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1989 బ్యాచ్‌లో ఎస్సైగా పోలీసు శాఖలో

Published : 26 May 2022 06:47 IST


ఎస్పీ మలికా గార్గ్‌కు మొక్క అందజేస్తున్న సెబ్‌ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ బ్యూరో (సెబ్‌) అదనపు ఎస్పీగా ఎన్‌.సూర్యచంద్రరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం... జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. 1989 బ్యాచ్‌లో ఎస్సైగా పోలీసు శాఖలో చేరిన సూర్యచంద్రరావు... విశాఖపట్నం రేంజి పరిధిలో బాధ్యతలు నిర్వహించారు. డీఎస్పీ హోదాలో అనిశాలో పనిచేశారు. అదనపు ఎస్పీగా ఉద్యోగోన్నతి పొందిన తర్వాత విజయనగరంలో ఓఎస్డీగా పనిచేస్తూ జిల్లా సెబ్‌కు బదిలీ అయ్యారు. సారా నిర్మూలనతో పాటు... గంజాయి, గుట్కా అక్రమ రవాణాను అడ్డుకుంటామని, ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారిస్తామని సూర్యచంద్రరావు తెలిపారు.

రీసర్వే, భూ దస్త్రాల స్వచ్ఛీకరణ వేగవంతం
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: రీసర్వే, భూ దస్త్రాల స్వచ్ఛీకరణపై సంబంధిత అధికారులతో సంయుక్త కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ రీసర్వేను వేగవంతం చేయడంతో పాటు... జిల్లా ముందు స్థానంలో ఉండేందుకు కృషి చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో డ్రోన్‌ ఫ్లయింగ్‌, దస్త్రాల స్వచ్ఛీకరణ సక్రమంగా జరగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. మండలాల వారీగా పురోగతిపై సమీక్షించారు. సమావేశంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ ఎం.శ్రీదేవి, సర్వే విభాగం ఏడీ గౌస్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.186
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: పొదిలి కేంద్రంలో బుధవారం నిర్వహించిన వేలంలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.186; మిగతా కేంద్రాల్లో రూ.185 చొప్పున లభించింది. ఎస్‌బీఎస్‌ రీజియన్‌లోని కేంద్రాలకు అమ్మకాల నిమిత్తం 3,850 బేళ్లు రాగా... వాటిలో 3,469; ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌ పరిధిలో 4,136 రాగా... 3,799 బేళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. పొదిలి కేంద్రంలో కిలో కనిష్ఠ ధర రూ.40 చొప్పున లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని