logo

పండగ వేళ ఊరట

దసరా, దీపావళి తదితర పండగల వేళ ఇతర నిత్యావసర వస్తువులతో పోలిస్తే నూనె ధరలు కాస్త దిగిరావడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వాటి ధరలు ఆకాశాన్నంటాయి. సరకు రవాణా తగ్గడం, ఇతర కారణాలు ప్రభావం చూపాయి.

Published : 02 Oct 2022 04:37 IST

దిగి వచ్చిన నూనె ధరలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే:

దసరా, దీపావళి తదితర పండగల వేళ ఇతర నిత్యావసర వస్తువులతో పోలిస్తే నూనె ధరలు కాస్త దిగిరావడం వినియోగదారులకు ఊరటనిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో జరిగిన ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో వాటి ధరలు ఆకాశాన్నంటాయి. సరకు రవాణా తగ్గడం, ఇతర కారణాలు ప్రభావం చూపాయి. దానికి తోడు వ్యాపారులు కొందరు నిల్వలు ఉంచడంతో గిరాకీ పెరిగింది. మార్కెటింగ్‌శాఖ ఒంగోలులోని రైతు బజార్లు, ప్రధాన కూడళ్లలో నూనె విక్రయ కేంద్రాలు ఏర్పాటుచేయడంతో బ్లాక్‌ మార్కెట్‌కు కొంత అడ్డుకట్ట పడింది. గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రం అదనంగా లీటరుకు రూ.20 పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చింది.

8 లక్షల కుటుంబాలకు..

జిల్లాలో సుమారు 8 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబం నెలకు సరాసరిన 3 లీటర్ల నూనె వినియోగిస్తుంటారు. జిల్లా వ్యాప్తంగా 24 లక్షల లీటర్ల ప్యాకెట్లు అవసరం. సరాసరిన రూ.50 తగ్గినా నెల వారీ బడ్జెట్‌లో ఒక్క నూనె వినియోగంపైనే కుటుంబానికి రూ.150 మేర ఆదా అవుతుంది. ఒకానొక సమయంలో పామాయిల్‌ ప్యాకెట్‌ ధర అత్యధికంగా రూ.160 పలకగా, తాజాగా ఒంగోలులోని హోల్‌సెల్‌ మార్కెట్‌లో రూ.90 ధర ఉంది. పండగల వేళ పిండి వంటలు చేసుకునేందుకు ఇది శుభ పరిణామమే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని