logo

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన అవసరం

ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని డీఆర్డీఏ పీడీ బి.బాబూరావు సూచించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌-2021లో భాగంగా జిల్లా స్థాయి జాతీయ సమగ్ర అవగాహన సదస్సును ఒంగోలు బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో గురువారం నిర్వహించారు.

Published : 25 Nov 2022 05:48 IST

సదస్సులో మాట్లాడుతున్న డీఆర్డీఏ పీడీ బాబూరావు.. వేదికపై బ్యాంకు ప్రతినిధులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలని డీఆర్డీఏ పీడీ బి.బాబూరావు సూచించారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌-2021లో భాగంగా జిల్లా స్థాయి జాతీయ సమగ్ర అవగాహన సదస్సును ఒంగోలు బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ.. సురక్షితమైన బ్యాంకింగ్‌ విధానాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. డిజిటల్‌ చెల్లింపులతో పాటు, సైబర్‌ నేరాల బారిన పడకుకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎల్‌డీఎం యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరికీ మన ఏటీఎం పిన్‌ నంబరు, బ్యాంక్‌ వివరాలు చెప్పకూడదన్నారు. అందరూ డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. కెనరా బ్యాంక్‌ ఆర్‌.ఎం.మారుతి శశిధర్‌ మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా తక్షణమే రుణాలు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. యూబీఐ ఆర్‌ఎం అరుణ మాట్లాడుతూ.. అవసరాలకు తక్కువ వడ్డీతో రుణం తీసుకుని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగొచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీజీబీ ఆర్‌ఎం హేమలత, పీడీసీసీ బ్యాంక్‌ డీజీఎం వేణుగోపాల్‌, ఎస్బీఐ ఆర్‌.ఎం.సుబ్రహ్మణ్యం, ఐసీఐసీఐ ఆర్‌ఎం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని