logo

గృహ నిర్మాణాల్లో అక్రమాలపై విచారణకు ఆదేశం

గృహ నిర్మాణాల్లో అక్రమాలపై కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు శుక్రవారం విచారణకు ఆదేశించారు. సున్న‘మేశారు’, జగనన్న కాలనీలో జలగలు, ఉచిత ఇసుకనూ వదల్లేదు! శీర్షికలతో ‘ఈనాడు’లో గత మూడు రోజులుగా ప్రచురితమైన కథనాలపై ఆయన స్పందించారు.

Published : 26 Nov 2022 05:28 IST

పూర్తి వివరాలతో నివేదిక కోరిన కలెక్టర్‌

నెల్లూరు(బృందావనం), న్యూస్‌టుడే: గృహ నిర్మాణాల్లో అక్రమాలపై కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు శుక్రవారం విచారణకు ఆదేశించారు. సున్న‘మేశారు’, జగనన్న కాలనీలో జలగలు, ఉచిత ఇసుకనూ వదల్లేదు! శీర్షికలతో ‘ఈనాడు’లో గత మూడు రోజులుగా ప్రచురితమైన కథనాలపై ఆయన స్పందించారు. మొత్తం వ్యవహారాలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని జిల్లా గృహ నిర్మాణసంస్థ పీడీ నాగరాజుకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీల్లోని లేఅవుట్లలో వేల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకుండానే బిల్లులు చేసుకోవడం.. 20వేల ఇళ్లను పూర్తి చేయాలని గుత్తేదారులకు అప్పగిస్తే.. ఇంత వరకు ఒక్కటీ పూర్తి కాకపోవడం..  గతంలో పూర్తయిన ఇళ్ల పేరుతో ఉచిత ఇసుకనూ పక్కదారి పట్టించడం వంటి అంశాలపై కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో మొత్తం వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్‌- సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ సంస్థ పీడీ నాగరాజు మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయని గుత్తేదారులకు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ ఆదేశించారన్నారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని