నల్లమలలో బాల సంస్కార కేంద్రాలు
బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న నల్లమల చెంచు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించేందుకు త్వరలో మరో సంస్థ ముందుకు రానుంది.
డిసెంబర్ 1 నుంచి ప్రారంభం
ఎన్టీఆర్ విజ్ఞాన కళా క్షేత్రం ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాట్లు
యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే
చీరాలలోని బాలసంస్కార కేంద్రంలో యోగాసనాలపై శిక్షణ
బయటి ప్రపంచానికి దూరంగా ఉన్న నల్లమల చెంచు పిల్లలకు చదువుతో పాటు సంస్కారం నేర్పించేందుకు త్వరలో మరో సంస్థ ముందుకు రానుంది. ఇప్పటికే స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ చెంచుల అభివృద్ధి కోసం పనిచేస్తోంది. తాజాగా ఎన్టీఆర్ విజ్ఞాన కళా క్షేత్రం ట్రస్టు ఆధ్వర్యంలో ‘బాల సంస్కార కేంద్రాలు’ ఏర్పాటుకానున్నాయి. యర్రగొండపాలెం మండలంలోని హనుమంతుని చెంచు గూడెం, పునరావాసకాలనీ, అంకమ్మ చెంచుగూడేల్లో ఇటీవల ఆ ట్రస్టు ఆధ్వర్యంలో మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పర్యటించి గిరిజనులతో మాట్లాడారు. అక్కడి చెంచుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు పిల్లలను వదలి అడవిలోకి వెళ్లి ఉసిరి కాయలు, సుగంధ గడ్డలు, తేనె, కుంకుడు తదితర అటవీ సంపద కోసం నాలుగు రోజుల నుంచి పది రోజుల పాటు ఉండి పోతుంటారు. ఆ సమయంలో ఇంటి వద్దే పిల్లలు ఉండటంతో కొందరు బడికి సక్రమంగా వెళ్లడం లేదు. మరికొందరు చెట్టు, పుట్టల వెంట తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో గూడేల్లో బాల సంస్కార కేంద్రాలు ఏర్పాటుచేయాలని ఈ ట్రస్టు సంకల్పించింది. సాయంత్రం రెండు గంటలు, ఉదయం ఒక గంట పిల్లలకు చదువుతో పాటు వివిధ సంప్రదాయాలు నేర్పించనున్నారు.
ఇటీవల నల్లమల చెంచుగూడేల్లో పర్యటిస్తున్న దగ్గుబాటి
ఉమ్మడి ప్రకాశంలో 22 కేంద్రాలు
దశాబ్దకాలంగా ఎన్టీఆర్ విజ్ఞాన కళా క్షేత్రం ట్రస్టు కింద తమ సొంత ఖర్చులతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి దంపతులు ‘బాల సంస్కార కేంద్రాలు’ ఏర్పాటు చేసి మత్స్య కారుల పిల్లలను ఉచితంగా చదివిస్తున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 24 కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల నుంచి చినగంజాం వరకు 22 గ్రామాల్లో ఉపాధ్యాయులను నియమించి పిల్లలకు ప్రతి రోజు రెండు గంటల పాటు విద్యా బోధన తోపాటు క్రమశిక్షణ, సత్ప్రవర్తన, నీతి కథలు, ఆటలు, యోగాసనాలు, శ్లోకాలు, సుభాషితాలు వంటివి బోధిస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లడం వల్ల వారి పిల్లల మీద అజమాయిషీ తగ్గి విద్యాపరంగా వారిని సరైన నడవడికలో పెట్ట లేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించి ట్రస్టు పిల్లలకు మంచి విద్యను నడవడికను, కళలు, ఆచార సంప్రదాయాలను నేర్పిస్తుంది.
సిబ్బందిని ఎంపిక చేశాం
ఆవుల తిరుపతి, కేంద్రాల ఇన్‌ఛార్జి
ప్రకాశం జిల్లాలో 82 గిరిజన చెంచు గూడేలు ఉన్నాయి. ఎక్కువగా వై.పాలెం నియోజకవర్గంలోని చెంచు గిరిజనులు బయటి ప్రపంచానికి దూరంగా అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. ఇక్కడి పిల్లల దీన పరిస్థితులను తెలుసుకుని విద్యను అందించేందుకు ఈ ప్రాంతాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. మొదట దశలో 12 కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాం. డిసెంబర్ 1వ తేదీ నుంచి కేంద్రాలు ప్రారంభించనున్నాం. వీటిలో పని చేసేందుకు ఇప్పటికే కొంత మంది సిబ్బందిని ఎంపిక చేశాం. వీటిలో నియమితులయ్యే ఉపాధ్యాయులకు రూ.2 వేల నుంచి రూ.7 వేల వరకు జీతం ఇవ్వనున్నాం. ఏడు నుంచి పది మంది ఉపాధ్యాయులపై ఒక పర్యవేక్షకుడిని సైతం నియమించనున్నాం. తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించేలా విద్యా బుద్ధులు నేర్పి ఆట పాటలతో కూడిన విద్యను అందించేందుకు ఈ బాల సంస్కార కేంద్రాలు ఎంతో దోహదపడతాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
-
India News
Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!
-
Sports News
Womens U19 Team: బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్కప్ విజేతలకు సత్కారం
-
India News
Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!
-
Movies News
Chiranjeevi: ఆ మాట ఎంతో ఉపశమనాన్నిచ్చింది.. తారకరత్న ఆరోగ్యంపై చిరంజీవి ట్వీట్