logo

కేసుల పరిష్కారంలో ప్రతిభకు ప్రశంసా పత్రాలు

దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అండర్‌ ఇన్వెస్టిగేషన్‌(యూఐ) కేసులను తగ్గించడంలో విశేషంగా కృషిచేసిన పోలీసు, సెబ్‌ అధికారులను ఎస్పీ మలికా గార్గ్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు.

Published : 20 Jan 2023 03:07 IST

ప్రశంసా పత్రాలు అందుకున్న పోలీసు అధికారులతో ఎస్పీ మలికా గార్గ్‌

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న అండర్‌ ఇన్వెస్టిగేషన్‌(యూఐ) కేసులను తగ్గించడంలో విశేషంగా కృషిచేసిన పోలీసు, సెబ్‌ అధికారులను ఎస్పీ మలికా గార్గ్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో రెండు విభాగాలకు చెందిన 98 మంది అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇటీవల కాలంలో జిల్లాలో 798 యూఐ కేసులను పోలీసులు పరిష్కరించినట్టు ఎస్పీ తెలిపారు. గంజాయి, మాదకద్రవ్యాల సరఫరా, రవాణా, విక్రయాలు, నాటుసారా తయారీ వంటి కేసుల్లో ప్రతిభ చూపిన ఏడుగురు సెబ్‌ అధికారులు, సిబ్బందికి కూడా ప్రశంసాపత్రాలు అందజేశారు. నేర నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు కె.నాగేశ్వరరావు(అడ్మిన్‌), ఎస్‌.వి.శ్రీధర్‌రావు(క్రైమ్స్‌), సెబ్‌ సూపరింటెండెంట్‌ ఆవులయ్య, ఎస్‌బీ డీఎస్పీ మరియదాసు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని