logo

పోలీసులు విచారణకు పిలిచారని ఆత్మహత్యాయత్నం

పోలీసులు విచారణకు పిలవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం అర్థవీడులో చోటు చేసుకుంది.  

Published : 27 Jan 2023 02:13 IST

అర్థవీడు, న్యూస్‌టుడే:  పోలీసులు విచారణకు పిలవడంతో మనస్తాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం అర్థవీడులో చోటు చేసుకుంది.  కాకర్ల గ్రామంలోని గన్నా చిన్న కోటయ్య ఇంట్లో అలమరలో ఉన్న 4 తులాల బంగారు సరుడు, రూ.5 వేల నగదు ఈ నెల 22న చోరీకి గురయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇంటి చుట్టు పక్కలలో ఉన్న వ్యక్తులపై దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన మండ్ల లక్ష్మయ్య అనే వ్యక్తితో పాటు మరో ఇద్దరిని విచారణకు పిలిచారు. మొదటి రోజు విచారించి ఇంటికి పంపారు..రెండో రోజు లక్ష్మయ్యను గురువారం స్టేషన్‌కు రావాలని మరోసారి కబురు పెట్టారు. అర్థవీడు వెళ్లిన లక్ష్మయ్య పోలీసు స్టేషన్‌కు వెళ్లితే పోలీసులు కొడతారని..బస్టాండ్‌ లోని ఓ దుకాణంలో పురుగుల మందు కొనుగోలు చేసి పక్కకెళ్లి తాగొచ్చినట్లు అతని వెంట ఉన్న భార్యకు చెప్పడంతో విషయం పోలీసుల దాకా చేరింది. దీంతో పోలీసులు చికిత్స కోసం ప్రైవేటు వాహనంలో అతడిని కంభం తరలించి..అక్కడ నుంచి మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం. దీనిపై ఎస్సై వెంకటేశ్వర్లు నాయక్‌ను వివరణ కోరగా..విచారణలో భాగంగా అతన్ని పిలిచామని, పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఈ చర్యకు పాల్పడినట్లు తెలియడంతో వెంటనే పోలీసులను అప్రమత్తం చేసి అతడిని వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని