logo

రైతులతో కలెక్టర్ల మమేకం

మండల కేంద్రం నాగులుప్పలపాడులో ఆదివారం ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్‌కుమార్‌, విజయకృష్ణన్‌ దంపతులు రైతులతో మమేకమయ్యారు.

Published : 30 Jan 2023 01:47 IST

సాగు విధానాలు.. గిట్టుబాటు ధరలపై ఆరా

పంటల పరిస్థితిపై రైతులను ఆరా తీస్తున్న ప్రకాశం, బాపట్ల జిల్లా కలెక్టర్లు దినేష్‌కుమార్‌, విజయకృష్ణన్‌

నాగులప్పలపాడు, న్యూస్‌టుడే: మండల కేంద్రం నాగులుప్పలపాడులో ఆదివారం ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు దినేష్‌కుమార్‌, విజయకృష్ణన్‌ దంపతులు రైతులతో మమేకమయ్యారు. పంటల స్థితిగతులపై ఆరా తీశారు. పొగాకు సాగు, క్యూరింగ్‌, గ్రేడింగ్‌ విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. మిరప, శనగ, కంది, మినుము పంటలను పరిశీలించారు. మిరపను తామర పురుగు ఆశిస్తుండటంతో వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి తగు మోతాదులో మందులు పిచికారీ చేయాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు తదితర విషయాలపైనా దినేష్‌కుమార్‌ ప్రశ్నించారు. రైతులకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. గుండ్లకమ్మ నీరు పూర్తిస్థాయిలో విడుదలైతే తమకు ఇబ్బంది ఉండదని రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. సుమారు గంటన్నరకు పైగా కలెక్టర్లు అక్కడే ఉన్నారు. అక్కడి ఓ దుకాణంలో టీ తాగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని