కొండపి వైకాపాలో గూండాగిరి
‘కొండపి నియోజకవర్గ వైకాపాలో కొందరు గూండాగిరికి పాల్పడుతున్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. అటువంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని అధిష్ఠానాన్ని కోరతాం’ అని రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు.
అసమర్థులకు సీటిస్తే ఓటమే
బహిష్కరించాలని నివేదిస్తాం: జూపూడి
సంఘీభావ సమావేశంలో మాట్లాడుతున్న జూపూడి ప్రభాకర్
సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ‘కొండపి నియోజకవర్గ వైకాపాలో కొందరు గూండాగిరికి పాల్పడుతున్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. అటువంటి వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని అధిష్ఠానాన్ని కోరతాం’ అని రాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. సంఘీభావ సదస్సు పేరుతో వైకాపా నియోజకవర్గ స్థాయి నాయకులతో సింగరాయకొండలో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూపూడి మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి సేవ చేసే వారిపై దాడికి పాల్పడినవారిని, అందుకు ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. టంగుటూరులో ఒక మహిళా నాయకురాలి ఇంటిపై దాడి చేయడం, మూడు రోజుల క్రితం వైకాపా రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి హత్యకు కుట్ర పన్నడం వంటి చర్యలు పార్టీకి వెన్నుపోటు పొడవడమే అన్నారు. నియోజకవర్గంలో అసమర్థుడికి సీటిస్తే వైకాపాకు ఓటమి తప్పదన్నారు. పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ.. అశోక్ కుమార్ రెడ్డిపై దాడికి పాల్పడినవారు, వెనుకున్న కుట్రదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇప్పటికే ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైకాపా వైద్యవిభాగం రాష్ట్ర అధ్యక్షుడు డా.అశోక్‌కుమార్‌రెడ్డి, మర్రిపూడి, టంగుటూరు, సింగరాయకొండ మండల అధ్యక్షులు రమణారెడ్డి, హరిబాబు, రామ్మూర్తి, పొన్నలూరు, సింగరాయకొండ ఎంపీపీలు మాధవ, శోభారాణి, కొండపి ఏఎంసీ ఉపాధ్యక్షుడు రంగారెడ్డి, మాజీ ఛైర్మన్ ప్రభావతి, ఆరు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sai pallavi: ఇంతకన్నా నీచం మరొకటి ఉండదు.. పెళ్లి రూమర్స్‌పై సాయిపల్లవి ట్వీట్
-
Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ
-
Sapta Sagaralu Dhaati Movie Review: రివ్యూ: సప్త సాగరాలు దాటి - సైడ్ ఎ
-
Congress: జగన్ నిరంకుశ పాలనకు ఇది నిదర్శనం: గిడుగు రుద్రరాజు
-
NCP : శరద్ పవార్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్ మద్దతుదారులు
-
Weather Report: తెలంగాణలో 3రోజుల పాటు వర్షాలు