logo

‘ఉద్యోగులు సహకరించాలి’

రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించాలని వైకాపా జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి కోరారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫిట్‌మెంట్‌పై

Published : 22 Jan 2022 04:52 IST


మాట్లాడుతున్న కృపారాణి, చిత్రంలో ఇతర నాయకులు

అరసవల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించాలని వైకాపా జిల్లా అధ్యక్షురాలు కిల్లి కృపారాణి కోరారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫిట్‌మెంట్‌పై కోత పడిందని ప్రతిపక్ష నాయకులు ఉద్యోగులను మభ్యపెడుతున్నారన్నారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వంలో ఉద్యోగుల భాగస్వామ్యం అసలైందని చెప్పారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 30 రోజుల్లోనే జగన్‌మోహన్‌ రెడ్డి 27 శాతం ఐఆర్‌ ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో వైకాపా నాయకులు అంధవరపు సూరిబాబు, శిమ్మ రాజశేఖర్‌, చౌదరి సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని