logo

మన్యంలో జాతీయ పర్యవేక్షణ బృందం పరిశీలన

సీతంపేట మన్యంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ఉపాధిహామీ పనులను శుక్రవారం జాతీయ పర్యవేక్షణ బృంద సభ్యులు ఎస్‌.కె.ప్రదాన్‌, సత్యబ్రత బెహరా పరిశీలించారు. పెదరామ, నౌగూడ, మొగదార, దేవనాపురం

Published : 22 Jan 2022 04:52 IST


నౌగూడలో కూరగాయల పంటను పరిశీలిస్తున్న బృంద సభ్యులు

సీతంపేట, న్యూస్‌టుడే: సీతంపేట మన్యంలోని వివిధ గ్రామాల్లో జరిగిన ఉపాధిహామీ పనులను శుక్రవారం జాతీయ పర్యవేక్షణ బృంద సభ్యులు ఎస్‌.కె.ప్రదాన్‌, సత్యబ్రత బెహరా పరిశీలించారు. పెదరామ, నౌగూడ, మొగదార, దేవనాపురం, కోడిశ, కుసిమి తదితర గ్రామాల్లో భూ అభివృద్ధి, రహదారులు, ఎవెన్యూ ప్లాంటేషన్‌, సెరికల్చర్‌ తదితర పనులను చూసి వేతనదారులతో మాట్లాడారు. దస్త్రాలు పరిశీలించారు. పనులు జరిగిన చోట ఏర్పాటు చేసిన బోర్డుల్లోని వివరాలు చూశారు. వారితో పాటు ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, ఏపీడీ శ్రీహరి, ఏపీవోలు, సాంకేతిక, క్షేత్రసహాయకులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని