logo

2,888 మందికి రూ.4.33 కోట్ల లబ్ధి

ఈబీసీ నేస్తం పథకంలో భాగంగా జిల్లాలో 2,888 మంది రూ.4.33 కోట్ల లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని దూరదృశ్య సమావేశం ద్వారా మంగళవారం ప్రారంభించారు.

Published : 26 Jan 2022 05:29 IST

నమూనా చెక్కును అందజేస్తున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఈబీసీ నేస్తం పథకంలో భాగంగా జిల్లాలో 2,888 మంది రూ.4.33 కోట్ల లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని దూరదృశ్య సమావేశం ద్వారా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పథకం ద్వారా 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారికి ఏడాదికి రూ.15,000 అందించనున్నట్లు చెప్పారు. ఆమదాలవలస నియోజకవర్గంలో 146 మంది, ఎచ్చెర్ల 347, ఇచ్ఛాపురం 543, నరసన్నపేట 121, పాలకొండ 173, పలాస 350, పాతపట్నం 308, రాజాం 407, శ్రీకాకుళం 369, టెక్కలి 124 మంది ఖాతాల్లో నగదు జమవుతుందని వివరించారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కును కలెక్టర్‌, జడ్పీ అధ్యక్షురాలు పిరియా విజయ అందజేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కంబాల జోగులు, జేసీ కె.శ్రీనివాసులు, ఆర్‌.శ్రీరాములునాయుడు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు ఎం.శ్రీకాంత్‌, ఎ.సూరిబాబు, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ ఎం.వి.పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని