logo

అభివృద్ధికి వికేంద్రీకరణ పాలన అవసరం

రాష్ట్రంలో జిల్లాల సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ పాలన అవసరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అభిప్రాయపడ్డారు. నరసన్నపేటలో ర.భ.అతిథిగృహం భవనాలను...

Published : 27 Jan 2022 06:12 IST


అతిథిగృహాన్ని ప్రారంభిస్తున్న ధర్మాన కృష్ణదాస్‌, చిత్రంలో పిరియా విజయ, దువ్వాడ శ్రీనివాస్‌ తదితరులు

నరసన్నపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో జిల్లాల సమగ్ర అభివృద్ధికి వికేంద్రీకరణ పాలన అవసరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అభిప్రాయపడ్డారు. నరసన్నపేటలో ర.భ.అతిథిగృహం భవనాలను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విస్తరించడంతో పాలన మరింత సులభం అవుతుందన్నారు.

జిల్లాకు ప్రాధాన్యం: విభజన ప్రక్రియలో సిక్కోలుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారన్నారని మంత్రి పేర్కొన్నారు. తాము చెప్పిన మేరకు పార్లమెంటరీ స్థానం పరిధితో పాటు ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలో ఉంచాలన్న సూచనకు ముఖ్యమంత్రి అంగీకరించడంతో జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారన్నారు. జిల్లాకు ఆయువుపట్టైన పారిశ్రామికవాడ, బీఆర్‌ అంబేడ్కర్‌ విశ్వవిద్యాలయం, ట్రిపుల్‌ ఐటలో ఉన్న ఎచ్చెర్ల నియోజకవర్గం జిల్లాలో కొనసాగించడం గొప్ప విషయమని కృష్ణదాస్‌ అభిప్రాయపడ్డారు. వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు చేస్తున్న నిరసన విరమించాలని కోరారు. ఉద్యోగులు తమలో అంతర్భాగమని, ప్రభుత్వం సూచనమేరకు చర్చలకు రావాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను ఈ సందర్భంగా కోరారు. జిల్లా పరిషత్‌ ఛైౖర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని