logo

‘దేశంలోనే అన్యాయమైన పీఆర్‌సీ ఇది’

దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్యాయమైన పీఆర్‌సీ ప్రకటించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ విమర్శించారు.

Published : 29 Jan 2022 05:24 IST

నిరాహార దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ రఘువర్మ, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్యాయమైన పీఆర్‌సీ ప్రకటించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి.రఘువర్మ విమర్శించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా పీఆర్‌సీ సాధన సమితి ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలోని ఎన్జీఓ హోం ఎదుట వరుసగా రెండో రోజు శుక్రవారం నిరాహార దీక్షలను కొనసాగించారు. దీక్షల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన పాల్గొని నిమ్మరసం తీసుకుని విరమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భారీ మెజారిటీకి ప్రధాన కారణమైన ఉద్యోగులు, పింఛనుదార్లను విస్మరించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్జీఓ రాష్ట్ర సహధ్యక్షులు చౌదరి పురుషోత్తమనాయుడు, జేఏసీ జిల్లా ఛైర్మన్‌ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని, హెచ్‌ఆర్‌ఏ స్లాబులను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరి 3న ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనేందుకు ఉద్యోగులు సన్నద్ధం కావాలని పిలువునిచ్చారు. ఈ ఆందోళనలో పీఆర్‌సీ సాధన సమితి నాయకులు సంపతిరావు కిశోర్‌కుమార్‌, కె.శ్రీరాములు, పి.వేణు, పి.జానకిరాం, నారాయణరావు, కె.భానుమూర్తి, తంగి మురళి, టి.చలపతిరావు, ఎస్‌.అనిల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

కవిటి: పాత జీతాలు చెల్లించాలని కోరుతూ మోకాళ్లపై నిల్చుని ఉపాధ్యాయుల నిరసన

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని