logo

‘సాగు పట్టాలిచ్చే వరకూ పోరాటం’

నారాయణపురం భూములకు సంబంధించి రైతులకు పట్టాలు ఇచ్చేవరకు దశల వారీగా పోరాటం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

Published : 25 Jun 2022 06:04 IST

చిలకపాలెంలో ర్యాలీ చేస్తున్న సీపీఎం నాయకులు, రైతులు

ఎచ్చెర్ల, న్యూస్‌టుడే: నారాయణపురం భూములకు సంబంధించి రైతులకు పట్టాలు ఇచ్చేవరకు దశల వారీగా పోరాటం చేస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, ఏపీ రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మోహన్‌రావు హెచ్చరించారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో శుక్రవారం నాగళ్లు, పారలు, కొడవళ్లు, గునపాలు తదితర పనిముట్లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పట్టాలు ఇవ్వాలని, ప్రజాసంఘాల నేతలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. రెవెన్యూ దస్త్రాల ప్రకారం 28 ఎకరాలు మాత్రమే ఇనాం భూములని, దానిని మాత్రమే శ్రీకాకుళానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోందన్నారు. మిగిలిన భూములను తరతరాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు.  సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగమణి, జిల్లా నాయకులు సి.హెచ్‌.అమ్మన్నాయుడు, అల్లు మహాలక్ష్మి, ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి పొందూరు చంద్రరావు, పోరాట కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని