logo

ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష

ప్రస్తుత రోజుల్లో ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి పేర్కొన్నారు. శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో ఎంపిక చేసిన సర్పంచులకు ప్రకృతి వ్యవసాయంపై శుక్రవారం

Published : 25 Jun 2022 06:04 IST

జీవామృతం తయారీ విధానంపై సర్పంచులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

పాతశ్రీకాకుళం, న్యూస్‌టుడే: ప్రస్తుత రోజుల్లో ప్రకృతి వ్యవసాయమే ఆరోగ్యానికి శ్రీరామరక్ష అని జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.లక్ష్మీపతి పేర్కొన్నారు. శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో ఎంపిక చేసిన సర్పంచులకు ప్రకృతి వ్యవసాయంపై శుక్రవారం జడ్పీ సమావేశమందిరంలో అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని ఎంతగా తగ్గించగలిగితే భూసారం పెంచడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించగలుగుతారని పేర్కొన్నారు. ఏపీసీఎన్‌ఎఫ్‌ డీపీˆఎం పి.రేవతి మాట్లాడుతూ జిల్లాలో 146 ఆర్‌బీకేల పరిధిలో 230 పంచాయతీల్లో ప్రకృతి వ్యవసాయన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అనంతరం ద్రవ, ధన జీవామృతం ఎలా తయారుచేసుకోవాలి, ఎలా వేయాలి, విత్తన శుద్ధి ఎలా చేయాలి, నార్లు వేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డీపీవో రవికుమార్‌, వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్‌, డీడీ భవాని, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని