logo

భద్రాచలానికి ప్రత్యేక బస్సులు

భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లే భక్తుల కోసం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎ.విజయ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 27 Mar 2023 05:16 IST

అరసవల్లి, న్యూస్‌టుడే: భద్రాచలంలో నిర్వహించే సీతారాముల కల్యాణ మహోత్సవానికి వెళ్లే భక్తుల కోసం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజారవాణాధికారి ఎ.విజయ్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం నగరం నుంచి స్పెషల్‌ సూపర్‌ లగ్జరీ బస్సు ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు బయలుదేరి 30న ఉదయం 6 గంటలకు భద్రాచలం చేరుకుంటుందని వివరించారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు భధ్రాచలంలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు శ్రీకాకుళం వస్తుందన్నారు. శ్రీకాకుళం నుంచి ఒక వైపు ఛార్జీగా రూ.990 ధర నిర్ణయించినట్లు చెప్పారు. అదే రోజున పలాస నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు అల్ట్రా డీలక్స్‌ బస్సును ఏర్పాటు చేశామని, దాని టిక్కెట్‌ ధర రూ.1050గా నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. ఏదైనా ఊరి నుంచి 40 మందికి మించి భక్తులుంటే అక్కడ నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 73829 21763, 73829 21647 నంబర్లను సంప్రదించాలని కోరారు.

మళ్లీ పాతబస్టాండ్‌ మీదుగా..: కరోనా సమయంలో నిలిచిపోయిన రెండు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆదివారం నుంచి పునరుద్ధరించినట్లు శ్రీకాకుళం రెండో డిపో మేనేజరు శర్మ తెలిపారు. పలాస నుంచి బయలుదేరిన బస్సు టెక్కలి, నరసన్నపేట, రామలక్ష్మణకూడలి, సూర్యమహల్‌, అరసవల్లి కూడలి, పాతబస్టాండ్‌, ఏడురోడ్లు, డే అండ్‌ నైట్‌ కూడళ్ల మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంటుందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని