logo

3,15,544 మందికి రూ.236.66 కోట్లు

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం   కిసాన్‌ పథకం మొదటి విడతగా 2023-24 ఖరీఫ్‌కి సంబంధించి జిల్లాలో 3,15,544 మంది రైతుల ఖాతాలో రూ.236.66 కోట్లు జమ చేయనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌  బి.లఠ్కర్‌ తెలిపారు.

Published : 02 Jun 2023 05:57 IST

లబ్ధిదారులకు నమూనా చెక్కు అందిస్తున్న స్పీకర్‌ సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, తదితరులు

కలెక్టరేట్‌ (శ్రీకాకుళం), న్యూస్‌టుడే: వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం   కిసాన్‌ పథకం మొదటి విడతగా 2023-24 ఖరీఫ్‌కి సంబంధించి జిల్లాలో 3,15,544 మంది రైతుల ఖాతాలో రూ.236.66 కోట్లు జమ చేయనున్నట్లు కలెక్టర్‌ శ్రీకేష్‌  బి.లఠ్కర్‌ తెలిపారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిరంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్‌, నర్తు రామారావు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన 251 మంది రైతుల ఖాతాలో పెట్టుబడి రాయితీ రూ.6.54 లక్షలు జమ చేసినట్లు వివరించారు. అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కు అందజేశారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, జిల్లా వ్యవసాయాధికారి కె.శ్రీధర్‌, వ్యవసాయ సలహా బోర్డు అధ్యక్షుడు నేతాజీ, అగ్రిమిషన్‌ సభ్యుడు రఘురాం, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎం.శ్రీకాంత్‌, జిల్లా ఉద్యాన అధికారి వర   ప్రసాద్‌, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు, తాతబాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని